ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను( Arvind Kejriwal ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి.ఎన్నికల ముందు ఆప్ గొంతు నొక్కేయడానికి కేంద్రంలోని బీజేపీ ఈ అరెస్ట్ చేయించిందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
భారత్‌లో అప్ కార్యకర్తలు రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.అటు విదేశాల్లోనూ ఆప్ కేడర్ నిరసనలకు దిగుతున్నారు.
తాజాగా కెనడాలోని( Canada ) ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం టొరంటోలోని భారత కాన్సులేట్( Indian Consulate ) వెలుపల ప్రదర్శన నిర్వహించారు.18 నుంచి 20 మంది ఆప్ వాలంటీర్లు కాన్సులేట్ ముందు గుమిగూడి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు.సుదీప్ సింగ్లా మాట్లాడుతూ .కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారని తమకు ముందే తెలుసునని , దీనిపై తాము కలత చెందామన్నారు.భారత్‌లో జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నామని అక్కడి పరిస్ధితులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సింగ్లా పేర్కొన్నారు.పరిస్థితుల్లో మార్పు రానిపక్షంలో కెనడాలోని వివిధ నగరాలతో పాటు ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలోని ఆప్ చాప్టర్‌లు ఆందోళనకు దిగవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్( Kejriwal Arrest ) వార్త వెలువడిన తర్వాత ఎన్నో ఫోన్‌కాల్స్ , ఆన్‌లైన్ సమావేశాలు జరిగాయి.నరేంద్ర మోడీ( Narendra Modi ) ప్రభుత్వ చర్యలను కెనడాలోని ఆప్ మద్ధతుదారులు ఖండించారు.ఇది ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుని నియంతృత్వం వైపు మళ్లించడమేనని వారు పేర్కొన్నారు.వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో కేజ్రీవాల్ అరెస్ట్ కూడా ఒకటని వారు అభివర్ణించారు.

మరోవైపు.ఆందోళనకారులను కాన్సులేట్ కార్యాలయంలోకి అడుగుపెట్టనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ వారు కాన్సులేట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హతమార్చడంతో ఖలిస్తాన్ అనుకూల గ్రూపుల బెదిరింపులు ఎక్కువయ్యాయి.దీంతో గత వేసవి నుంచి కాన్సులేట్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)ని మంచు తుఫాను కప్పివేయడంతో నిరసనను చాలా త్వరగా ముగించారు.