తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనితా చౌదరి ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోలకు హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే మొదట అనితా కు తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ యాంకర్లు కావాలి అన్న ప్రకటనకు ఆమె ఫోటో ఇవ్వడంతో ఆమెకు ఈటీవీలో అవకాశం వచ్చిందట.
ఆ తర్వాత ఆమె కమెడియన్ బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేసే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
ముఖ్యంగా ఆమె కస్తూరి సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
ఆ సీరియల్ తర్వాత ఆమె పేరు కంటే ఆమె నటించిన కస్తూరి పేరు చాలా మంది గుర్తు పెట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సీరియల్ ఏడేళ్ల పాటు సాగింది.ఆ సమయంలో అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా నా ప్రేమలో పడిపోయారు.
నన్ను అప్పట్లో బాగా ఇష్టపడేవారు.కుప్పలు తిప్పలుగా చదవలేనని ఉత్తరాలు వచ్చేవి.
కొందరు భర్తలు అయితే తమకు భార్యలు అన్నం పెట్టడం లేదు అంటూ కూడా ఫిర్యాదు చేసేవాళ్ళు.అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నాను అని తెలిపింది అనితా చౌదరి.
ఆ తర్వాత ఆమెకు నెమ్మదిగా బుల్లితెరపై ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో వరుసగా సీరియల్లలో అవకాశాలు వచ్చాయి.అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు రావడంతో దూసుకుపోయింది.ఇక ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో సూరీడు.ఏడున్నావ్ రా! అన్న డైలాగుతో విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.అలా ఆమె ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనితా చౌదరి.