చెక్కపై అద్భుత కళాఖండం.. చూస్తే వావ్ అంటారు

చాలామంది కళాకారులు ( Artists ) తమ టాలెంట్‌తో అందరినీ అబ్బురపరుస్తారు.తమలోని టాలెంట్‌ను వెలికితీసి కొత్త కొత్త కళలు ప్రదర్శిస్తూ ఉంటారు.

 Artist Amazing Wood Work Resembling Village Life Video Viral Details, Viral News-TeluguStop.com

కొంతమంది ఆర్టిస్టులు చేసే ప్రయోగాలు, ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.తాజాగా చెక్క మీద బొమ్మ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ఆర్టిస్ట్.

గ్రామీణ జీవితాన్ని( Village Life ) తెలియజేస్తూ చెక్కపై ఓ ఆర్టిస్ట్ గీసిన కళాఖండం అందరిని ఆకర్షిస్తోంది.టన్సు యెజన్( Tansu Yegen ) అనే ట్విట్టర్ యూజర్ చెక్కతో గీసిన కళాఖండానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు,

అద్భుతమైన కళ( Brilliant Art ) అనే శీర్షికతో ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు.ఈ స్టన్నింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు ఈ కళాఖండం చూపించింది.

ఈ బొమ్మను చూసి నెటిజన్లు వావ్ అంటూ ఆర్టిస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ బొమ్మ గీసిన కళాకారుడు ఎవరనేది మాత్రం వివరాలు తెలియరాలేదు.

కానీ కళాకారుడి టాలెంట్‌ను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.ఒక చెక్కపై ఇంత అందంగా గీయడం నిజంగా ఎవరికీ సాధ్యం కాదంటూ నెటిన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదొక మిరాకిల్ అంటూ కొంతమంది పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియోకు లైక్స్, షేర్లు తెగ వస్తున్నాయి.

తాను ఇప్పటివరకు ఇలాంటి చక్కని కళాఖండాన్ని ఎక్కడా చూడలేదని, తాను ఇప్పటివరకు చూసిన చక్కని విషయాల్లో ఇది ఒక్కటని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపాడు.ఒక కళాకారుడిగా తాను ఈ ప్రతిభను చూసి మరింత స్పూర్తి పొందుతున్నట్లు చెప్పాడు.ఇలా చాలామంది కళాకారుడి ప్రతిభను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.చెక్క మీద బొమ్మలు వేయడం అనేది పురాతన కాలంలో ఉండేది.ఈజిప్షియన్ హైరోగ్లిఫ్‌లు ఈ కళను కనిపెట్టారు.భారతదేశంలో కూడా ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు.

చెక్కలపై విగ్రహాలు,రాజభవనాలు వంటివి గీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube