ఘనంగా ఆరోగ్య ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అలాగే ఆయా జిల్లాల్లో నర్సింగ్ కళాశాలలు, మైత్రి ట్రాన్స్ క్లినిక్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ వసంత రావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, డీ.సీ.హెచ్.ఎస్ పెంచలయ్య, జీజీహెచ్ వైద్యులు సంతోష్ కుమార్,డాక్టర్లు హాజరయ్యారు.

వర్చువల్ పద్దతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను, మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించగా, స్థానికంగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో 30 డిప్లమా ఇన్ అనస్థీషియా కోర్సులకు 30 డిప్లమా ఇన్ ఈసీజీ కోర్సులకు మొత్తం 60 సీట్లు , 14 వైద్య పోస్టులు మరియు 3 అంబులెన్స్లను మంజురు చేసారు.

జిల్లా దవాఖానలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు.దవాఖాన లోని మొదటి అంతస్తులోని 116 రూం నెంబర్ లో ముగ్గురు వైద్యులతో క్లినిక్ సిద్ధం చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్చిన, వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేసిన కేసులు తప్పవు..
Advertisement

Latest Rajanna Sircilla News