కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ TSLPRB , JNTUH ఆధ్వర్యంలో ఆగస్టు 28 తేదీన నిర్వహించనున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

 Armored Arrangements For Constables Preliminary Written Examination , Tslprb , H-TeluguStop.com

వారియర్ తెలిపారు.ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్ళ ఆర్హత రాత పరీక్షకు హజరవుతున్నట్లు తెలిపారు.

ఇందులో ఖమ్మం నగరం, పరిసరాల పరిధిలోని 89 పరిక్ష కేంద్రాలలో 31,415 మంది అభ్యర్థులు, అదేవిధంగా సత్తుపల్లిలోని 16 పరిక్ష కేంద్రాలలో 8,136 మంది అభ్యర్థులు పరిక్ష వ్రాయనున్నారని తెలిపారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్లు పూర్తి చేశారని తెలిపారు.

రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు తీసుకోనే విధంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావల్సి వుంటుందని, పరీక్షకు సంబంధించి నియమ నిబంధనలు హాల్ టికెట్లో పొందుపరిచి వుంటాయని, పరీక్ష గదిలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఇతర వస్తువులను అనుమతించరని తెలిపారు.పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా పారదర్శకంగా అమలవుతుందని స్పష్టం చేశారు.

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మరాదని, అలాంటి వ్యక్తులు ఏవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ వ్రాత పరిక్షల సందర్భంగా అయా పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలుల్లో వున్నందున ఆగష్టు 28 న ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

అదేవిధంగా పరిక్ష సమయంలో సమీపంలో జిరాక్స్ సెంటర్లు ముసివేయాలని సూచించారు.ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube