ఖిలాడితో జాయిన్ అయిన యాక్షన్ కింగ్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Arjun Joins Khiladi Shooting, Khiladi, Raviteja, Ramesh Varma, Arjun, Tolllywood-TeluguStop.com

ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రవితేజ మరోసారి ఖిలాడి చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా, ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమా షూటింగ్‌లో అర్జున్ తాజాగా జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు, ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో రవితేజ, అర్జున్‌ల మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ అంటోంది.
మొత్తానికి నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తరువాత అర్జున్ ఖిలాడి సినిమాలో నటిస్తుండటంతో, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.అయితే ఈ సినిమాతో రవితేజ తన క్రాక్ సక్సె్స్‌ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

మరి ఖిలాడి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube