బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ తెలిసిందే.గత సీజన్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
దీంతో ఈ సీజన్ లో ఏకంగా ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని అందుకుంది.మొత్తానికి కంటెస్టెంట్ ల ఇంటర్వ్యూతో అరియానా స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.
తన ప్రశ్నలతో ప్రతి ఒక్కరిని బాగా ఆడుకుంది.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి ని ఇంటర్వ్యూ చేసి సిరి కి చెమటలు పట్టేలా చేసింది ఈ బోల్డ్ బ్యూటీ.
ఇంతకు అరియానా వేసిన ప్రశ్నలకు సిరి ఎటువంటి సమాధానం ఇచ్చిందో చూద్దాం.నిజానికి సిరి మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ తో హౌస్ లో ఎలా ప్రవర్తించిందో చూశాం.
ఆఖరికి షణ్ముఖ్ కూడా సిరి తో ఆ విధంగానే ప్రవర్తించాడు.
అలా వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అరియానా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
ఇంటర్వ్యూ ప్రారంభంలో షణ్ముఖ్ ఫోటోను డిస్ ప్లే చేసి.అతడి గురించి చెప్పమని ప్రశ్నించింది.
దీంతో సిరి షన్ను కోసం ఏం చెప్పాలి.అందరికీ తెలిసిందే కదా అని అనడంతో వెంటనే అరియానా సిరి ని హగ్ చేసుకుంది.
ఇక సిరి నవ్వుతూ ఫ్రెండ్ షిప్ హగ్ అనడంతో.ఫ్రెండ్షిప్ హగ్.ఆంటీ ఫ్రెండ్ షిప్ హగ్ అని కౌంటర్ వేసింది.దీంతో సిరి నా హగ్ లు గట్టిగా వెళ్ళినట్లు ఉన్నాయని అనడంతో.
ఒకటా రెండా సీజన్ మొత్తం హగ్ ల యుద్ధం చేస్తే జనాల్లోకి వెళ్లకుండా ఉంటాయా సుమీ అంటూ బాగా బదులు ఇచ్చింది అరియానా.

షణ్ముఖ్ కు ఐ లవ్ యు ఎందుకు చెప్పావు అని ప్రశ్నించడంతో.ఫ్రెండ్స్ కి ఐ లవ్ యు చెప్పరా.చెబితే తప్పేంటి అన్నట్లు సమాధానమిచ్చింది.
అతడితో బాగా కనెక్ట్ అయిపోతున్నాను అంటూ గతంలో నాగార్జున ముందు ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.వారి మధ్య లవ్ నడుస్తుందని కంటెస్టెంట్స్ కూడా బయటికి వచ్చాక చెప్పారు.

కానీ తాను మాత్రం ఫ్రెండ్షిప్ అంటూ కవర్ చేసుకుంటుంది.ఇక ఇన్ని రోజులు ఇందులో ప్రయాణం ఒంటరిగా ఆడారా.సపోర్ట్ తీసుకొని ఆడారా.అనడంతో ఒంటరిగా ఆడాను అని బదులిచ్చింది.షణ్ముఖ్ దూరం పెడుతున్న కూడా ఎందుకు అతని దగ్గరికి వెళ్లావు అని గట్టిగా ప్రశ్నించింది.

ఇక రవి ని ఎందుకు ఎలిమినేట్ చేశారు.ఆ తర్వాత ఎందుకు నీ కోసం ఆడుతున్నాము అని రవితో చెప్పారు అని అనడంతో సిరి ఈ ప్రశ్నను కవర్ చేయాలని ప్రయత్నించింది.సన్నీ ని టార్గెట్ చేయలేదు అంటూ అబద్ధాలు కూడా చెప్పేసింది.
ఇక షణ్ముఖ్ కు ఎందుకు వెళ్లి ముద్దు పెట్టావు అని అనడంతో సిరికి చెమటలు పట్టించింది అరియానా.మొత్తానికి ఈ ఇంటర్వ్యూ చాలా హైలెట్ గా మారింది.