ఆ సమయం వస్తే నేనే ఆ విశేషం చెప్తా.. గీతా మాధురి కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ ఒక చోట చేరితే ఆ సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల ఉత్సవం పేరుతో ఒక ఈవెంట్ రాబోతున్న విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా షూటింగ్ కూడా జరుగుతోంది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లతోపాటు అన్ని సీజన్ల కంటెస్టెంట్ లు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే షూటింగ్ విరామ సమయంలో ఫన్నీ వీడియోలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్ లొకేషన్ లో అరియానా, గీతా మాధురి ని పలు ప్రశ్నలు వేసింది.

ఇక గీతామాధురి కూడా అందుకు కూల్ గా నవ్వుతూ సమాధానం చెప్పింది.అందుకు సంబంధించిన వీడియోని అరియానా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Advertisement

నీ బుగ్గలు ఎందుకు ఉబ్బాయ్ అంటే.ఐదు రోజులు పది గంటల పాటు పడుకున్నా అందుకే ఉబ్బాయి.

అని గీతా మాధురి చెప్పుకొచ్చింది.అప్పుడు వెంటనే అరియానా గుడ్ న్యూస్ ఏం లేదా అని ప్రశ్నించగా.

గుడ్ న్యూస్ వంటిది ఏమీ లేదు.ఈ క్షణానికి ఏమీ లేదు.

ముందు జరగొచ్చు.ఆ విషయాన్ని తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అంటూ గీతామాధురి ఆన్సర్ ఇచ్చింది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఎప్పుడో వచ్చే ఆ క్షణానికి ముందుగా ఇప్పుడే కంగ్రాట్స్ అని అరియానా అనగా.ఒకవేళ విశేషం వస్తే ఆరు, ఏడు నెలలో ఖచ్చితంగా చెబుతాను.తథాస్తు అని గీతామాధురి చెబుతుంది.

Advertisement

అయితే గీతా మాధురి తన రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇలా పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక అరియానా విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని విపరీతమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.ఇప్పుడు అదే జోష్ తో దూసుకుపోతోంది.

ప్రస్తుతం బుల్లితెర పై పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది.

తాజా వార్తలు