టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు భద్రత లేదని, ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో హౌస్ అరెస్టుకు అనుమతించాలని న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు.
మరోవైపు చంద్రబాబు భద్రతకు వచ్చిన సమస్య ఏమీ లేదని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు కోర్టుకు వెల్లడించారు.చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని పేర్కొన్నారు.జైలులో ఎవరికీ లేని విధంగా చంద్రబాబుకు ప్రత్యేకంగా బ్లాక్ కేటాయించామన్నారు.24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్న న్యాయవాది పొన్నవోలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఇవాళ మరోసారి దీనిపై వాదనలు విననున్న న్యాయమూర్తి హౌస్ అరెస్టుపై నిర్ణయం ప్రకటిస్తారు.అదేవిధంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నూ కూడా ధర్మాసనం ఇవాళ విచారించే అవకాశం ఉంది.







