స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీ ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్ పై వాదనలు వాయిదా పడ్డాయి.ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు రేపు వాదనలు విననుంది.
అదేవిధంగా దీనిపై కౌంటర్ పిటిషన్ చంద్రబాబు తరపు న్యాయవాదులు రేపు కోర్టులో దాఖలు చేయనున్నారు.కాగా కుంభకోణం విచారణలో భాగంగా చంద్రబాబును ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మరికాసేపటిలో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







