విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం అయ్యాయి.ఈ మేరకు హౌస్ అరెస్టుకు అనుమతించాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది.బెయిల్ రాకపోయే సరికి హౌస్ అరెస్ట్ కోరుతున్నారన్న సీఐడీ హౌస్ అరెస్టుకు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది.
అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, కోర్టు ఆదేశాల మేరకు జైలులో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని సీఐడీ కోర్టుకు తెలిపింది.అయితే సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదన్న సీఐడీ మరో రెండు కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని వెల్లడించింది.







