ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ పానీయాన్ని తాగి చూడండి..!

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల, గంటల తరబడి వ్యామాలు చేయడం వల్ల, అధిక ఒత్తిడి జ్వరం వచ్చినప్పుడు, పోషకాలు కొరత ఉన్నప్పుడు వంటి కారణాలతో ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి.

అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తే తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు సహజంగా పెయిన్ కిల్లర్ గా పనిచేసే వాము ఆకు ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వాము ఆకు( Ajwain Leaves )తో డ్రింక్ తయారు చేసుకుని తాగితే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇలా అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముందుగా మిక్సీ జార్లో అరకప్పు వాము ఆకూ, ఒక స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం నీటిని పోసి మెత్తగా చేసుకోవాలి.మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టాలి.

Advertisement

దీనిలో రెండు స్పూన్ల తేనె( Honey ) ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.ఈ విధంగా తాగడం వల్ల ఎటువంటి నొప్పులు అయినా తగ్గిపోతాయి.

అలాగే ఇందులో ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

దీన్ని ప్రతిరోజు తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి( Immunity ) పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు వంటివి కూడా దూరమైపోతాయి.యాంటీ బయోటిక్ లక్షణాల కారణంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఆకలి లేని వారికి ఈ డ్రింక్ ని ఇస్తే ఆకలి పెరుగుతుంది.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు