సొంత సామాజికవర్గం లో ఇంత అసంతృప్తా ? 

కులం చుడం.మతం చూడం, పార్టీలు చూడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ( Welfare schemes )అందిస్తాం అంటూ చెప్పడమే కాదు దానిని అమలు చేసి చూపిస్తున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ).

 Are You So Unhappy In Your Own Community ,ysrcp, Ap, Tdp, Jagan, Ap Government,-TeluguStop.com

ఇక మంత్రివర్గంలోనూ,  పార్టీ పదవుల్లోనూ సామాజిక వర్గాల ప్రకారం ప్రాధాన్యం కల్పిస్తూ వస్తున్నారు.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీంతోపాటు కమ్మ , కాపు సామాజిక వర్గాలకు పెద్దపేట వేస్తూనే .రాబోయే ఎన్నికల కోసం జగన్ వ్యూహాలు పన్నుతున్నారు.జగన్ ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నా.  జగన్ సామాజిక వర్గమైన రెడ్ల విషయంలో ప్రాధాన్యం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో అసంతృప్తిని కలిగిస్తుంది.

కేవలం కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నా,  వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడిన రెడ్డి సామాజిక వర్గానికి( Reddy community ) చెందిన చాలామంది నేతలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరైన ప్రాధాన్యం దక్కకపోవడం తో,  చాలాసార్లు ఆ సామాజిక వర్గం గుర్రుగా ఉంది.ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం .

Telugu Anamramnarayana, Ap, Ap Polics, Jagan, Kotamsridhar, Mlc, Reddy, Ysrcp, Y

వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు కమ్మ సామాజిక వర్గం టిడిపి వైపు,  కాపు సామాజిక వర్గం జనసేన వైపు ఉన్నారనేది అందరికీ తెలిసిందే.అయితే 2019 ఎన్నికల్లో బీసీ , ఎస్సీ , ఎస్టీ, మైనారిటీలు వైసీపీ వైపు ఉండడంతోనే జగన్ ఆ స్థాయిలో విజయం సాధించారు.రెడ్డి సామాజిక వర్గం మొత్తం తన వెంటే ఉంటుందని జగన్ భావించారు.అందుకే మంత్రివర్గంలోనూ మిగతా నియామకాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.అయితే అదే వారిలో అసంతృప్తికి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.

Telugu Anamramnarayana, Ap, Ap Polics, Jagan, Kotamsridhar, Mlc, Reddy, Ysrcp, Y

వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన  ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు.గుడివాడ నుంచి కొడాలి నాని , గన్నవరం వల్లభనేని వంశీ , దెందులూరు అబ్బాయి చౌదరి,  మైలవరం వసంత కృష్ణ ప్రసాద్,  పెదకూరపాడు నంబూరి శంకర రావు, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు.అయితే వీరెవరు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు.

అలాగే టిడిపి కూడా వీరు ఎవరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయలేదు.వైసీపీ ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యం దక్కుతోందని, అన్ని పనులు చక్కబెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారనే సంతృప్తి ఆ సామాజిక వర్గంలో ఉంది.

కానీ రెడ్డి సామాజిక వర్గంలోనే జగన్ తీరుపై అసంతృప్తి ఉంది.అన్ని పదవుల్లోనూ మిగతా సామాజిక వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం , రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం లేదనే అసంతృప్తి ఉంది.

ఈ మధ్యకాలంలో అది మరింత బహిరంగం అయ్యింది.ఇప్పుడు సందర్భం రావడంతో ఒక్కొక్కరిగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ రచ్చ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube