టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా..? అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

టమోటా ( Tomato )అనేక రకాల వంటకాలు ఉపయోగపడుతుంది.కానీ టమోటా త్వరగా పాడైపోతుంది.

దీనికోసం టమోటాలను సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం.ఫ్రిడ్జ్ లో పెడితే టమాటాలు ఒక వారం రోజులు అయినా వాడుకోవచ్చు.

అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు( Scientists ).అయితే ఈ టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అలాగే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు వివరంగా చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఫ్రిడ్జ్ ( Fridge )లో పెడితే ముందు ఉన్న టమాట సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే ఏమీ కాదు.కానీ వారం దాకా అలానే ఫ్రిడ్జ్ లో టమోటాలు ఉంటే సహజ లక్షణం కోల్పోతాయి.

అలాగే మిథైలేషన్( Methylation ) అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం.జీవి డిఎన్ఏ కి అనుగుణంగా మార్చే ప్రక్రియ ఇది.జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర వహిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫ్రిడ్జ్ లో టమాటాలు పెడతామో వాటి లోపల ఉన్న జల్లి పగిలిపోతుంది.

దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది.

ఒక విధంగా చెప్పాలంటే లోపల అంతా మెత్తగా అయిపోతుంది.దీన్ని మనం ఆహారంగా తీసుకోకపోవడమే చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.టమాటాలు మంచిగా రెడ్ కలర్ లో పండుగా అయినప్పుడు ఇథిలిన్( Ethylene ) విడుదల చేస్తాయి.

ఆ సినిమాలో 100 మందితో ఫైట్ సీన్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ ఇదేనంటూ?
ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!

అయితే ఫ్రిడ్జ్ లో చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది.ఈ క్రమంలో టమాటాలు అసలైన రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి.కాబట్టి వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిని వాడడం వలన విషంతో సమానమని వాటిని వాడకపోవడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

" autoplay>

తాజా వార్తలు