తెలంగాణ ఉద్యమం లో మంత్రి హరీష్ రావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.గట్టి వాక్చాతుర్యం తో.
రాజకీయాల్లో నిలదొక్కు కున్న అయన.ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగారు.అంతే కాకుండా అయన చేపట్టిన ప్రతి పదవిలో.తన మార్క్ చుపించుకున్నారు.దానికి తోడు తనకంటూ ప్రత్యేక కేడర్ కు ఏర్పాటు చేసుకున్నారు.
అయితే.2018 లో పార్టీ అధికారం లోకి వచ్చాక హరీష్ రావు నీ సీఎం కెసిఆర్ పక్కన పెట్టడం తో అయన చాలా హట్ అయ్యారని తెలుస్తోంది.అది ఆ నోటా ఈ నోటా పాకడం తో.పార్టీ పై విమర్శలు మొదలు అయ్యాయి.ఇక హరీష్ రావ్ నీ పార్టీ లో నుంచి పంపడానికి ఇదంతా సీఎం కెసిఆర్ చేస్తున్నారని సైతం పుకార్లు వచ్చాయి.
ఆప్పుడు హరీష్ రావ్ పక్కచుపులు చూసారని సైతం పుకార్లు వచ్చాయి.
అయితే అప్పటికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సర్ది చెప్పారు.
తెలంగాణ ఉద్యమం టైమ్ నుంచి.ఆయనకు తోడుగా ఉన్న ఈటెల పంపినప్పుడే హరీష్ రావు కూడా పార్టీ మారే ఆలోచన చేశారని.
ఒక ఇంటర్వ్యూ లో ఈటెల చెప్పారు.అప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్దగా వైరల్ కాలేదు.
కానీ ఇప్పుడు హరీష్ రావు చేస్తున్న కొన్ని పనులు అయన పార్టీ మారే సంకేతాలు కు ఆజ్యం పోస్తున్నాయి.

ఈటెల రాజేందర్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.తనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉండేదని.బీజేపీ లోకి రాక పోతే కొత్త పార్టీ పెట్టే వాడిని అని అన్నారు.
అయితే అప్పటికి హరీష్ రావ్ నుంచి స్పష్టమైన క్లారిటీ రాక పోవడం తో అయన సైలెంట్ అయ్యారని.అయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పుడు హరీష్ రావు, సీఎం కెసిఆర్ లు ఎడ మొహం పేడ మొహం గా కనిపిస్తున్నారు.దానికి కారణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ పదవి కానీ, ఎంపీ పదవి గానీ ఇచ్చి ప్రజలకు దూరంగా ఉంచాలని ప్లాన్ చేశారని.హరీష్ హట్ అయ్యారట.
అందుకే ఇప్పుడు అయన స్వంత రాజకీయం మొదలు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నారు.

రాజకీయాల టైమ్ కావడం తో.పుట్టగొడుగుల్లా న్యూస్ చానెళ్ళు పుట్టుకు వస్తున్నాయి.అయితే వళ్ళంతా హరీష్ రావు కు సన్నిహితులు కావడం.
వాటిని స్వయంగా హరీష్ రావ్ ఓపెన్ చేస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.ఒకవేళ హరీష్ రావు ఊహించి నట్టు.
పరిస్థితులు మారితే.ఈటెల తో కలిసి కొత్త పార్టీ నీ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దానిని తోడు అటు హరీష్ రావుకు, ఇటు ఈటెల మంచి ఫాలోయింగ్, కేడర్, నాయకుల పట్టు ఉండటం తో.విల్లు ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాస్తే.కెసిఆర్ కు చెక్ పెట్టా గలరు అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.మరి హరీష్ అంతర్గతం తెలియాలి అంటే ఎన్నికలు రావాల్సిందే.







