థియేటర్స్‌లో స్పీకర్లు పగులుతాయి.. వీరసింహా రెడ్డి‌పై థమన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి.గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన విషయం తెలిసిందే.ఇందులో బాలయ్య బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.కాగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక రేపు అనగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.

 Music Director Thaman Made Interesting Comments About Veera Simha Reddy Songs An-TeluguStop.com

దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

కాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన జై బాలయ్య, సుగుణసుందరి,మా బావ మనోభావాలు, మాస్ మొగుడు లాంటి పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ పాటలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలోని పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.

వీర సింహారెడ్డి సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాము.

Telugu Balakrishna, Shruti Haasan, Thaman, Tollwood-Movie

ఈ సినిమా వేరే రేంజ్ లో ఉంటుంది.అంతేకాకుండా వీరసింహారెడ్డి సినిమాకు థియేటర్లలో స్పీకర్లు పగులుతాయి అని ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశాడు.బాలకృష్ణ గారి కల్ట్ సినిమా ఇది.బాలకృష్ణ గారి ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ ఎంత అభిమానిస్తున్నారు అన్నది వీరసింహారెడ్డి సినిమా రిజల్ట్ చెబుతుంది అని తెలిపారు తమన్.అదేవిధంగా వీరసింహారెడ్డికి, అఖండ సినిమాతో పోలిక లేదు అని తెలిపారు.

Telugu Balakrishna, Shruti Haasan, Thaman, Tollwood-Movie

ఈ సినిమా హై ఎమోషనల్,సిస్టర్ సెంటిమెంట్,బాలకృష్ణ గారి మాస్ ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోతాయి అని తెలిపారు తమన్.దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారి అభిమాని కావడంతో ఈ సినిమాలో మరింత గొప్పగా రూపొందించారు.ఇందులో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారు.అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు.దర్శకుడు గోపీచంద్ రెండు పాత్రలను బాగా డిజైన్ చేశారు.దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను.

సినిమాకు బేస్మెంట్ దర్శకుడే.గోపీచంద్ అద్భుతంగా తీయడం వల్లే మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చాడు తమన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube