తేనెటీగల పెంపకం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి..!

తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి స్థలం, కొద్దిపాటి పెట్టుబడి ఉంటే చాలు.మార్కెట్లో తేనెకు ఏడాది పొడవునా డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం పొందవచ్చు.

 Are You - Beekeeping Remember These Precautions, Beekeeping, Honey Bee, Farme-TeluguStop.com

కాబట్టి చాలామంది రైతులు తేనెటీగల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు.కానీ సరైన అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో తేనె( Honey ) దిగుబడి పొందలేక ఆదాయాన్ని పొందలేకపోతున్నారు.

తేనెటీగలు( Bees ) మొక్కలలో పరాగ సంపర్కానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.వివిధ రకాల పంటలలో, పండ్ల మొక్కలలో అధిక దిగుబడికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి.తేనెటీగల పెంపకానికి పొడవైన చెక్క పెట్టెలను తయారు చేసుకోవాలి.చెక్క పెట్టెలో కనీసం వెడల్పు 100 సెంటీమీటర్లు ఎత్తు, 50 సెంటీమీటర్లు ఎత్తు, 25 సెంటీమీటర్ల మందం, రెండు సెంటీమీటర్లు రంధ్రం తేనెటీగలు సులువుగా లోనికి బయటికి రావడానికి వీలుగా తయారు చేసుకోవాలి.

లోపల తేనెటీగలు తిరగడానికి ఫ్రీగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి.

పెట్టే యొక్క రంధ్రాలు మూసుకుపోకుండా, ఎన్ని తేనెటీగలు లోపలికి వెళ్లిన బరువు తట్టుకునే విధంగా తయారు చేసుకోవాలి.తేనెటీగల పెట్టెల వద్దకు వెళ్లేటప్పుడు, తేనెటీగలు కుట్టకుండా శరీరం అంత కప్పబడి ఉండేలాగా దుస్తులు ధరించాలి.తేనె పట్టును చేతులతో కాకుండా ఒక కత్తి సహాయంతో కత్తిరించాలి.

ఎక్కువగా ప్రజలు తిరిగే ప్రాంతాలలో, విద్యుత్ స్టేషన్లు, ఇసుక బట్టీలు, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాలలో తేనెటీగల పెంపకం చేయరాదు.

స్వచ్ఛమైన నీరు ( Pure Water )ప్రవహించే ప్రాంతంలో తేనెటీగల పెంపకం చాలా మంచిది.ఇంకా ఈదురుగాలుల నుండి తేనెటీగలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదంటే కృత్రిమంగా పెరిగిన చెట్ల మధ్యన అయితే సురక్షితం.ఇలాంటి జాగ్రత్తలు తేనెటీగల పెంపకంలో పాటిస్తే కేవలం ఒక పెట్టనుంచే దాదాపుగా 10 కేజీల వరకు తేనె పొందవచ్చు.

తేనె తీగలు కుడితే చాలా ప్రమాదం కాబట్టి ఎల్లప్పుడూ శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించే ఈ తేనే తీగల పెట్టల వద్దకు వెళ్లాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube