ఓటర్లు ఇలా ఫిక్స్ అయ్యారా ? టి.కాంగ్రెస్ కు ఫలితాల టెన్షన్ 

రెండు రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించారు  అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తూనే ఉంది.

కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు పట్టం కట్టారు.

దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గుచూపురా అనే అనుమానం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.పార్టీ నాయకుల అంతర్గత సంభాషణలోనూ ఈ విషయం పైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా తీవ్ర పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయనే విషయం పైన కాంగ్రెస్ అగ్ర నాయకులు అభ్యర్థులతో చర్చించారు.అయితే డైవర్ట్ ఓటు కాంగ్రెస్ ( Congress )కు ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఇస్తాయనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు .అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రం బిజెపి( BJP ) వైపు ఓటర్లు మొగ్గు చూపారు అనే అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వచ్చినట్లు గా తెలుస్తోంది.జాతీయ అంశాలే అజెండాగ సాగిన ఎంపీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిందని,  ఆ ఓటు బ్యాంకు బిజెపి వైపు మళ్ళిందనే టెన్షన్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Advertisement

ఈ విషయంపైనే వారంతా ఆందోళన చెందుతున్నారు.వందరోజుల పాలనకు ఎంపీ ఎన్నికలు రిఫరెన్స్ అంటూ కాంగ్రెస్ గొప్పగా ప్రకటించింది.అయితే ఇప్పుడు ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోతే జనాలో చులకన అవుతామనే ఆలోచనలు పడ్డారు .కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను చూసి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.పోలింగ్ సరళిని చూసిన తర్వాత మంత్రులు , ఎమ్మెల్యేలు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారట.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే మెరుగ్గా ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చేలా పనిచేయాలని , 17 స్థానాలకు గాను 12 , 13 స్థానాల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేలా కృషి చేయాలని హైకమాండ్ పెద్దలు టార్గెట్ విధించారు.

  అయితే ఇప్పుడు ఆ టార్గెట్ ను చేరుకుంటామా లేదా అనే టెన్షన్ లో వారు ఉన్నారు.  ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కి ఎన్నికల ఫలితాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి .ఎక్కువ స్థానాలను గెలుచుకుంటేనే కాంగ్రెస్ హై కమాండ్ వద్ద పలుకుబడి ఉంటుందని , లేకపోతే తన గ్రాఫ్ తగ్గుతుందనే టెన్షన్ లో రేవంత్ ఉన్నారట.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు