జగ్గారెడ్డి విషయంలో రేవంత్ కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు జగ్గారెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇటీవల కాంగ్రెస్ నేతలు ఐక్య రాగం వినిపించినా కోమటి రెడ్డి కాస్త తగ్గినా జగ్గారెడ్డి మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్న రీతిలో తన వ్యవహార శైలి ఉన్న పరిస్థితి ఉంది.

 Are There Any New Implications For Rewanth In The Case Of Jaggareddy , Mla Jagga-TeluguStop.com

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే రకరకాల వ్యూహాలు పన్నుతూ సన్నద్దమవుతున్న తరుణంలో జగ్గారెడ్డి వ్యవహారం రేవంత్ కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలంటే చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీపై చర్చ జరిగే పరిస్థితి ఉండాలి తప్ప పార్టీలో అంతర్గత విభేదాలపై ప్రజల్లో చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదమే కాక, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం పెరిగే అవకాశం ఉంటుంది.అయితే జగ్గారెడ్డి విషయంలో మాత్రం రేవంత్ కు సరికొత్త చిక్కులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం జగ్గారెడ్డి బహిరంగంగా రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది.అయితే జగ్గారెడ్డి మాత్రం రేవంత్ మెదక్ జిల్లా రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారని దానికి మాత్రమే తాను అభ్యంతరం తెలుపుతున్నానని జగ్గారెడ్డి తెలిపినా కెటీఆర్ తో సఖ్యతగా మెలగడం వలనే జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ లో జగ్గారెడ్డితో మాత్రమే రేవంత్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్న తరుణంలో రానున్న రోజుల్లో జగ్గారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube