జగ్గారెడ్డి విషయంలో రేవంత్ కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు జగ్గారెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇటీవల కాంగ్రెస్ నేతలు ఐక్య రాగం వినిపించినా కోమటి రెడ్డి కాస్త తగ్గినా జగ్గారెడ్డి మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్న రీతిలో తన వ్యవహార శైలి ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే రకరకాల వ్యూహాలు పన్నుతూ సన్నద్దమవుతున్న తరుణంలో జగ్గారెడ్డి వ్యవహారం రేవంత్ కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలంటే చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీపై చర్చ జరిగే పరిస్థితి ఉండాలి తప్ప పార్టీలో అంతర్గత విభేదాలపై ప్రజల్లో చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదమే కాక, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే జగ్గారెడ్డి విషయంలో మాత్రం రేవంత్ కు సరికొత్త చిక్కులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం జగ్గారెడ్డి బహిరంగంగా రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది.

అయితే జగ్గారెడ్డి మాత్రం రేవంత్ మెదక్ జిల్లా రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారని దానికి మాత్రమే తాను అభ్యంతరం తెలుపుతున్నానని జగ్గారెడ్డి తెలిపినా కెటీఆర్ తో సఖ్యతగా మెలగడం వలనే జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ లో జగ్గారెడ్డితో మాత్రమే రేవంత్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్న తరుణంలో రానున్న రోజుల్లో జగ్గారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.

విద్యార్ధి వీసాలకే మా తొలి ప్రాధాన్యత : భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి