మహేష్ బాబు కోసం హాలీవుడ్ జనాలు అంతలా ఎదురుచూస్తున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.

అయితే మహేష్ బాబు(Mahesh Babu ) హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ముఖ్యంగా వాళ్ళ నాన్న అయిన కృష్ణ గారి నట వారసత్వాన్ని నిలబెట్టేలా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్రను వేసుకున్నాయనే చెప్పాలి.

ముఖ్యంగా ఆయన చేసిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మెన్, శ్రీమంతుడు లాంటి సినిమాలు ఆయనని చాలా ఉన్నత శిఖరాల్లో నిలిపాయి.

అందుకే సూపర్ స్టార్ అనే నేమ్ కి ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఉంది.ప్రస్తుతం ఈయన వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో మహేష్ బాబు అందం మీద ఇప్పటికే హాలీవుడ్ జనాలు( Hollywood ) సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి( Rajamouli ) కి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో హాలీవుడ్ లో కొంత ఇమేజ్ అయితే ఏర్పడింది.

Advertisement

ఇక ఆయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే మహేష్ బాబు గురించి వాళ్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.కొంతమంది మహేష్ బాబు ఎలా ఉంటాడు అంటూ గూగుల్ లో తన పిక్స్ ని కూడా సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అలాగే ఆయన సినిమాల్ని చూడాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలి సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు.ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది చెబితే సినిమా మీద అంచనాలు అమాంతం తారాస్థాయిలోకి వెళ్ళిపోతాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు