ఒకవైపు అధికార పక్షం వైసీపీ నుంచి పార్టీని రక్షించుకునేందుకు.టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు.
అదే సమయంలో.పార్టీని పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ వయసులో నూ ఆయన దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత చేస్తున్నా.
పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు.ఆధిపత్య పోరు.
పదవీ వ్యామోహం వంటివి ఇబ్బంది కలిగిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.మొత్తంగా చూస్తే.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం అంటే.ఎన్నికలు జరిగే నాటికి పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయమని అంటున్నారు.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.తాము తలపెట్టిన ఏపీ కలల రాజధాని.అమరావతిని నిలబెట్టుకునేందుకు టీడీపీ సంకల్పం చెప్పుకొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వైసీపీ తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తోంది.
అంతేకాదు.ఇటు ఆన్‌లైన్‌లోను, అటు ఆఫ్‌లైన్‌లోనూ కూడా ఉద్యమిస్తోంది.
ఇక, ఇప్పుడు వచ్చిన కార్పొరేషన్ ఎన్నిక లను తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగాలని.నిర్ణయించుకుంది.
రాజధాని ప్రాంతంలో శిఖరంగా ఉన్న విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని.తద్వారా అమరావతికి ఈ రెండు జిల్లాల ప్రజలు సిద్ధంగా లేరనే వాదనను వినిపించాలని నిర్ణయించుకుంది.

అయితే.ఇప్పుడు ఈ రెండు నగరాల్లోనే టీడీపీలో తమ్ముళ్లు రోడ్డెక్కుతున్నారు.కార్పొరేషన్లలో వార్డు సభ్యుల నుంచి మేయర్ పదవుల కోసం తమలో తామే పోటీ పడుతున్నారు.పార్టీ అధిష్టానం ఒకరికి అ వకాశం ఇస్తే.మరొకరు సొంత నిర్ణయాలు తీసుకుని రెబెల్స్‌గా రంగంలోకి దిగుతున్నారు.దీంతో విజయ వాడ, గుంటూరులో రెబెల్స్ బెడద టీడీపీని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెడుతోంది.
విజయవాడలో ఎంపీ నాని వర్గం ఎక్కువగా వార్డుల్లో పోటీ ఉంది.అయితే.
కొందరు లోపాయికారీగా చేస్తున్న రాజకీయంతో ఇక్కడ రెబెల్స్ వెలుస్తున్నారు.రోజుకో వార్డులో టీడీపీ రెబెల్స్ పెరుగుతున్నారు.
దీనికితోడు రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
ఇక, గుంటూరు విషయాన్ని తీసుకుంటే.
మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్ర పేరును చంద్రబాబు ప్రతిపాదించారు.అయితే.
ఈయనకు పోటీగా మరికొందరు రంగంలోకి దిగారు.అయితే పార్టీలోనే కొందరు కావాలనే రంగంలోకి దింపారనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో వీరిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం హుటాహుటిన అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపడం గమనార్హం.ఆయన వెంటనే గుంటూరులో సమావే శమై.
పరిస్థితిని పరిశీలిస్తున్నారు.బుజ్జగింపుల పర్వానికి తెరదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.మొత్తానికి టీడీపీలో తమ్ముళ్ల అంతర్గత కలహాలే ఆ పార్టీ కంచుకోటలను కూల్చేస్తున్నాయి.