తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని జంటలను చూసి బ్రతికితే ఇంత ప్రేమ గా , ఇంత అన్యోయంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు.అలాంటి ఆదర్శ జంటల్లో ఒకటి రామ్ చరణ్ – ఉపాసన( Ram Charan , Upasana ) జంట.
పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అయినా కూడా సంతానం విషయం లో ఈ జంట తీసుకున్న ఏకాభిప్రాయం కోట్లాది మందికి ఆదర్శం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవాళ్ళే పెళ్లి చేసుకొని రెండేళ్లు దాటి సంతానం కలగకపోతే ఎదో లోపం ఉంది అన్నట్టుగా తక్కువ భావం తో చూస్తారు.
భార్య భర్తల మధ్య కలహాలు ఏర్పడుతాయి, విడిపోతారు కూడా.ఇది సర్వసాధారణంగా మన కళ్ళు ముందు సమాజం లో జరుగుతున్న సంఘటనలు.కానీ అన్నీ సంవత్సరాలు సంతానం లేకపోయినా, నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటున్న కూడా లెక్క చెయ్యకుండా అన్నిటిని ఎదురుకున్నారు రామ్ చరణ్ – ఉపాసన.రీసెంట్ గానే ఈ జంటకి ‘క్లిన్ కారా( Klin Kaara )’ అనే పాప జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ పాప ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రామ్ చరణ్ – ఉపాసన.
ఇలా అన్నీ విషయాల్లో అర్థం చేసుకుంటూ సంసారం జీవితం ని కొనసాగిస్తున్న ఈ జంట డబ్బు విషయం లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట.ఒకరి డబ్బు కోసం ఒకరు ఎదురు చూడరు.ఏదైనా చారిటీ చెయ్యాలన్నా, ఏదైనా కొనుక్కోవాలి అన్నా ఎవరి డబ్బులను వాళ్ళే ఉపయోగించుకుంటారట.
విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ తన భార్య ఉపాసన( Upasana ) అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి అనేది చూడలేదట.ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.
ప్రతీ సందర్భంలోను ఒకే మాట ఒకే బాట లాగా జీవిత పయనం చేసిన ఈ జంట డబ్బు విషయం లో ఎందుకు అంత కచ్చితంగా ఉన్నారు అనేది అర్థం కానీ ప్రశ్న.
రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్టార్, ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది.ఇక ఉపాసన ‘అపోలో’ హాస్పిటల్స్( Apollo Hospitals ) కి చైర్మన్.ఈమె నెల ఆదాయం కూడా వందల కోట్లలోనే ఉంటుంది.
ఇద్దరికీ కావాల్సినంత డబ్బులు అందుతున్నప్పుడు, ఒకరి డబ్బులతో ఒకరికి ఏమి సంబంధం ఉంటుంది అనేది అభిమానుల పాయింట్.వాళ్ళ పాయింట్ లో కూడా నిజం ఉంది కదా అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.