ఢిల్లీతో పాటు దేశంలోని అన్నిప్రాంతాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.వీటన్నింటి మధ్య నిమ్మకాయ ధర అందరి దృష్టిని ఆకర్షించింది.నిమ్మకాయ కిలో రూ.350-400కి చేరింది.పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడమే కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.అయితే నిమ్మకాయల విషయానికొస్తే.ధరలు పెరగడానికి ఉత్పత్తియే కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.గుజరాత్‌లో తుపాను అనంతర పరిస్థితుల కారణంగా నిమ్మకాయల ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి కాలంలో చాలామంది నిమ్మరసం తాగుతుంటారు.
ఎందుకంటే ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి.
వేడి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.నిమ్మకాయలను మార్కెట్‌లో కిలో రూ.350-400 ధరకు విక్రయిస్తున్నారు అంటే 10 రూపాయలకు ఒక్కటి కూడా లభించని పరిస్థితి నెలకొంది.ఇంధన ధరల పెరుగుదల కారణంగా కూరగాయల మార్కెట్లలో కూరగాయలు అధిక ధరలకు లభిస్తున్నాయని ఢిల్లీలోని కూరగాయల వ్యాపారులు అంటున్నారు.
అలాగే, తుపాను కారణంగా గుజరాత్‌లో పంటలు దెబ్బతిన్నాయి.పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి.తూర్పు ఢిల్లీకి చెందిన ఒక కూరగాయల వ్యాపారి మాట్లాడుతూ నిమ్మ, క్యాప్సికం ధరలు పెరిగాయని, ఉల్లి, టమోటా వంటి ప్రధాన కూరగాయల ధరలు కూడా పెరిగాయని తెలిపారు.

‘‘ఈ రోజుల్లో నిమ్మకాయల ధరలు కిలో రూ.350 నుంచి రూ.400కి చేరాయి.గతంలో నిమ్మకాయల ధరలు ఈ స్థాయికి ఎప్పుడూ చేరుకోలేదు.గుజరాత్‌లో తుపాను కారణంగా పంట నష్టం కారణంగా ఇది జరుగుతోంది.అదే సమయంలో, టమాటా ధరలు కిలో రూ.40 నుండి రూ.45 వరకు ఉండగా, గతంలో కిలో రూ.30-35 వరకు విక్రయమయ్యేది.అదే విధంగా ఉల్లి ధరలు కూడా పెరిగి, ఇప్పుడు కిలో రూ.40 వరకు చేరుకున్నాయి.గతంలో కిలో రూ.30-35 మేరకు విక్రయించేవారు.