ఏపీ కాంగ్రెస్ కు మంచి రోజులు రానున్నాయా ?

ఏపీలో కాంగ్రెస్ ( Congress in AP )పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.ప్రస్తుతం ఆ పార్టీలో చెప్పుకోదగిన బలమైన నేతలు లేకపోవడం ,  క్యాడర్ కూడా చెల్లా చేదురు కావడం,  పార్టీలో కీలక నాయకులు అనుకున్నారు చాలామంది చాలా ఇబ్బందులు ఇతర పార్టీల్లో చేరిపోవడం వంటివి ఎన్నో జరిగాయి.ఏపీ , తెలంగాణ విభజనకు కాంగ్రెస్ ప్రధాన కారణమని జనాలు నమ్మడంతో,  కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.2014 నుంచి రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు .ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదనే విధంగా పరిస్థితి ఉంది.  దీంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ని మెరుగుపరిచి పరుగులు పెట్టించాలని ఆ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకుంది .

 Are Good Days Coming For Ap Congress , Ap Congress, Telangana Congress, Telangan-TeluguStop.com
Telugu Ap Congress, Ap, Jagan, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia, Telangana,

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, మరికొద్ది రోజుల్లో జరుగనున్న తెలంగాణ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్నారు.  కర్ణాటక లో ఇప్పటికే అధికారంలోకి రావడంతో మంచి జోష్ మీద ఉన్న ఆ పార్టీ అధిష్టానం, ఏపీలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిర్ణయించుకుంది.కొద్ది నెలల క్రితం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్దరాజును( Gidugu Ruddaraju ) నియమించింది.ఆయన పనితీరుపై నమ్మకంతోనే ఉంది.ఏపీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయం పైన కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్దర్రాజు ఆలోచనలు చేస్తున్నారు.  దీనిలో భాగంగానే ఏపీ ప్రజల్లో ఏపీ రాజధాని అమరావతి కి సంబంధించిన సెంటిమెంట్ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది .తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Assembly elections in Telangana ) తంతు ముగిసిన తర్వాత,  అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తుంది.ఈ సభకు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశమునట్లు సమాచారం.

రాహుల్, ప్రియాంక గాంధీలు( Rahul , Priyanka Gandhi ) ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి కీలకమైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారట.

Telugu Ap Congress, Ap, Jagan, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia, Telangana,

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెంచడంతో పాటు,  2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పదుల స్థానాల్లోనైనా సీట్లను దక్కించుకునే విధంగా పరిస్థితి మార్చలనే పట్టుదలతో కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్నారట.  దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ ప్రభావం ఏపి పైన పడుతుందని,  ఇక్కడా పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే ఏపీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube