వార్ వన్ సైడ్ అన్న చంద్రబాబు మాటలు నిజమయ్యేనా?

ఇటీవల తాము నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం తమకు ప్లస్ పాయింట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది.ఈ మేరకు చంద్రబాబులో ధీమా కూడా పెరిగిపోయింది.

 Are Chandrababu's Words 'war One Side' True Telugu Desam Party, Tdp, Chandrabab-TeluguStop.com

దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుందని ఆయన ప్రకటనలు చేస్తున్నారు.టీడీపీ కార్యకర్తల్లో కసి.వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్‌కు కారణమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.పైగా ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని ఆయర అంటున్నారు.

అయితే చంద్రబాబులో ధీమా పెరగడానికి కారణం కేవలం మహానాడు మాత్రమే కాదని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.అంతకుముందు బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని గుర్తుచేస్తున్నాయి.

అందుకే పార్టీ నాయకుల సమావేశాల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ చంద్రబాబు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని వివరిస్తున్నాయి.అయితే టీడీపీలో వార్ వన్ సైడ్ అన్న ధీమాకు మరో కారణం కూడా కనిపిస్తోంది.

జనసేనతో పొత్తు దాదాపుగా కన్‌ఫార్మ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే ఇతర పార్టీలతో పొత్తుల విషయాన్ని ఇప్పుడే బయటపెట్టడం సరైన స్ట్రాటజీ కాదని చంద్రబాబు భావిస్తున్నారు.

అలా జరిగితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.అందుకే మహానాడులో పొత్తుల విషయాన్ని లేవనెత్తలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap Poltics, Chandrababu, Janaseena, Mahanadu, Pawan Kalya

మరోవైపు గతంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కోస్తా జిల్లాల రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.కోస్తా జిల్లాలు ఎటు కొమ్ము కాస్తాయన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.రాయలసీమ జిల్లాల్లోనూ క్రమంగా టీడీపీకి ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తున్నారు.ముఖ్యంగా వరుసగా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సొంత పార్టీ నేతల్లో చంద్రబాబు ధైర్యం నింపుతున్నారు.

ఇదే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలపై ఆధారపడుతుందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube