మహేష్ బాబు గురించి ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా.. రాఖీ తల్లి కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.కొత్తగా మహేష్ బాబును చూసిన వాళ్లు ఎవరైనా మహేష్ బాబు వయస్సు 46 సంవత్సరాలు అంటే అస్సలు నమ్మలేరనే సంగతి తెలిసిందే.

 Archana Jois Comments About Mahesh Babu Goes Viral In Social Media , Archana Ji-TeluguStop.com

మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా నటించినా ఎవరూ నెగిటివ్ కామెంట్లు చేయరంటే మహేష్ బాబు ఎంత యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారో సులభంగానే అర్థమవుతుంది.

మహేష్ బాబుతో ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.కేజీఎఫ్2 సినిమాలో రాఖీ భాయ్ తల్లి అర్చనా జోయిస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు పెళ్లైందని పిల్లలు ఉన్నారని తెలిసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడని చూడటానికి తారక్ చాలా క్యూట్ గా ఉంటాడని అర్చనా జోయిస్ కామెంట్లు చేశారు.

ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ అర్చనా జోయిస్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాగుంటుందని సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అర్చన జోయిస్ తెలిపారు.

మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో అని అర్చన జోయిస్ కామెంట్లు చేశారు.అర్చన జోయిస్ కథక్ నృత్యకారిణి కాగా కెరీర్ విషయంలో అర్చన జోయిస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Telugu Archanaa Jois, Ntr, Kgf, Mahadevi, Mahesh Babu, Prabhas, Prashant Neil, R

మహాదేవి అనే సీరియల్ ద్వారా అర్చన జోయిస్ కెరీర్ ను మొదలుపెట్టగా కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ సాధించడానికి ఈమే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్2 ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధించనుందో చూడాల్సి ఉంది.అర్చన జోయిస్ కెరీర్ విషయంలో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.అర్చన జోయిస్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube