లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన డ్రీం ప్రాజెక్టుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-1. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లను నిర్వహించిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమం హైదరాబాదులో ఎంతో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్కార్ అవార్డు గ్రహీత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ వేదిక పైకి రెహమాన్ రాగానే ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది.వేదిక పైకి వచ్చిన రెహమాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ తాను గత 38 సంవత్సరాల నుంచి తెలుగులో పనిచేస్తున్నాను.

రమేష్ నాయుడు దగ్గర నుంచి చక్రవర్తి, రాజ్ కోటి, సత్యం వంటి గొప్ప వారితో తాను కలిసి పని చేశానని రెహమాన్ తెలిపారు.ఇక తెలుగు సంగీతం అనేది ఒక ఫౌండేషన్ అని సంగీతాన్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత తాను నెట్ ఫిక్స్ తో పాటు ఇతర ఫారిన్ సిరీస్ లను చూడటం పూర్తిగా మానేశానని,మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు.
ఈ సినిమా చూసిన అనంతరం ఫారెన్ సిరీస్ లను చూసే అలవాటు మానుకున్నానని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







