ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలపై ఎఫ్ఐఆర్ నమోదు

అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ డిస్మిస్ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.ఎస్పీ ఫక్కీరప్ప, ఏఆర్ అడిషనల్ ఎస్పీ మహబూబ్ భాషాపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

 Ar Constable Prakash Case On Sp Additional Sp And Dsp In Anantapur Two Town Ps,-TeluguStop.com

డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాశ్ అధికారులపై మంగళవారం టూ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.తప్పుడు రిపోర్ట్ ఇచ్చి దళితుడైన తన ఉద్యోగం పోయేందుకు కారణమయ్యారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానిస్టేబుల్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రకాశ్ ఫిర్యాదుపై ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అనంతపురం రేంజ్ డీఐజీ పక్క జిల్లాలకు చెందిన వ్యక్తులను విచారణాధికారిగా నియమించి కేసును విచారణ చేయిస్తారని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube