కరోనా తర్వాత ఇండస్ట్రీకి కలిసిరాలేదా.. ఏప్రిల్ లో విడుదలైన మెజారిటీ సినిమాలు ఫ్లాపా?

కరోనా తర్వాత ఏప్రిల్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది.గత మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏప్రిల్ నెలలో విడుదలవుతున్నటువంటి సినిమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నాయి.

కరోనా తర్వాత ఏప్రిల్ నెలలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి కానీ అంచనాలను మాత్రం చేరుకోవడంలో విఫలమవుతున్నాయి.2021 ఏప్రిల్ నెలలో వైల్డ్ డాగ్, వకీల్ సాబ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఈ సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

ఇక 2022 ఏప్రిల్ నెలలో గాని అలాగే ఆచార్య సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించిన ఆచార్య కూడా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది.ఇక 2023లో రవితేజ రావణాసుర అఖిల్ ఏజెంట్ సమంత శాకుంతలం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశను ఎదుర్కొన్నాయి.

ఇక 2024వ సంవత్సరంలో కూడా ఎన్నో అంచనాల నడుమ విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) నటించిన ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్( Mrunal Thaku r) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.ఇక ఈ ఏడాది ఈ సినిమాతో పాటు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఏప్రిల్ రెండో వారంలో విడుదలైంది.గీతాంజలి సినిమా మంచి సక్సెస్ అందుకున్న సీక్వెల్ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

ఇక రెండో వారంలోనే డియర్, లవ్, శ్రీరంగనీతులు వంటి సినిమాలు వచ్చిన నిరాశపరిచాయి.ఇక ఏప్రిల్ మూడో వారంలో తెప్ప సముద్రం, మార్కెట్ మహాలక్ష్మి, పారిజాత పర్వం, శరపంజరం, టేనెంట్ వంటి సినిమాలు వచ్చాయి.

ఇవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఇక నాలుగో వారంలో విశాల్ నటించిన రత్నం( Ratnam ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

Advertisement

తాజా వార్తలు