నెలలో 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం!

ఎంత ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్లను వాడినప్పటికీ జుట్టు రాలడం, చిట్లడం, విరగడం, చుండ్రు తదితర సమస్యలన్నీ తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

వీటికి చెక్ పెట్టి జుట్టును సంరక్షించుకోవాలంటే కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ ను నెలలో రెండే రెండు సార్లు కనుక వేసుకుంటే మీరు ఊహించని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి పది నుంచి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి.

Applying This Hair Mask Twice A Month Will Give You Unexpected Benefits Hair Ma
Advertisement
Applying This Hair Mask Twice A Month Will Give You Unexpected Benefits! Hair Ma

పూర్తిగా చల్లారిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో ఉడికించిన మిశ్రమం నుంచి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల‌ వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.

రెండు గంటల అనంతరం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Applying This Hair Mask Twice A Month Will Give You Unexpected Benefits Hair Ma

నెలలో రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారి హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.డ్రై హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా అవుతుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుముఖం పడతాయి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

అదే సమయంలో కురులు ఒత్తుగా సైతం పెరుగుతాయి.కాబట్టి కచ్చితంగా ఈ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు