వారంలో ఒక్క‌సారి ఈ ఆయిల్‌ను రాస్తే పొడ‌వాటి జుట్టు మీసొంతం అవుతుంది!

ఒకప్పుడు దాదాపు అందరి జుట్టు చాలా పొడుగ్గా మరియు ఒత్తుగా ఉండేది.కానీ, ప్రస్తుత రోజుల్లో పొడుగు జుట్టు అమ్మాయిలే కరువయ్యారు.

పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వినియోగించడం, రెగ్యులర్‌గా తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంటుంది.దాంతో జుట్టును పొడుగ్గా పెంచుకోవాలనే కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వారంలో ఒక్కసారి రాశారంటే పొడవాటి ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటో.

దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను పోయాలి.

Advertisement

ఈ నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉంచాలి.

ఆపై పల్చ‌టి వస్త్రం సాయంతో నూనెను సపరేట్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.

ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని కొద్ది సమయం పాటు మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది.

ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు