యాపిల్లో ఇకనుండి చాట్జీపీటీ పనిచేయదు... కారణం ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.యాపిల్లో ఇకనుండి చాట్జీపీటీ పనిచేయదు.అవాక్కవుతున్నారా? విషయం తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవండి.

ఇంటర్నెట్ ప్రపంచంలో చాట్జీపీటీ అనేది పెను మార్పులను తెస్తోంది.

అంతేకాకుండా గూగుల్ వంటి పోటీ కంపెనీలకు సైతం ఈ చాట్జీపీటీ ఒక సవాల్ గా మారి, నిద్ర పట్టనివ్వడం లేదు.విషయంలోకి వెళితే, ఇక మీద మరీ పాత కాలం ఆండ్రాయిడ్, ఐవోఎస్ సాఫ్ట్ వేర్ ఆధారిత ఫోన్లలో చాట్జీపీటీ పనిచేయదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

చాట్ జీపీటీ టెక్నాలజీ పరిశ్రమలో పెను మార్పులను తీసుకొచ్చింది.ఇపుడు చాలామంది చాట్ జీపీటీ ద్వారా కోడింగ్ రాయడం, హోం వర్కలు చేయడం, ఎస్సేలు ప్రిపరేషన్ చేయడం వంటివి క్షణాల్లో చేస్తున్నారు.ఇది ఇలానే కొనసాగితే.

పిల్లల నాలెడ్జ్ ను దెబ్బ తీస్తుందని, ఉద్యోగుల్లో క్రియేటివిటీని, సొంతంగా పని చేయాలనే ఆలోచనను తగ్గిస్తుందని కొందరు ఆందోళన చెందినప్పటికీ నిపుణులు మాత్రం చాట్జీపీటీని సమర్థిస్తున్నారు.దానివలన ఉపయోగమే కానీ, నిరుపయోగం ఉండదని చెబుతున్నారు.

Advertisement

అయితే.పిల్లలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యాపిల్ కంపెనీ ఐఫోన్స్ లో చాట్ జీపీటీని బ్యాన్ చేయడం కొసమెరుపు.వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం చాట్జీపీటీ తరహా చాట్ బాట్ ఏఐ సేవల్ని అందించడాన్ని యాపిల్ నిషేదించింది.

తమ మొబైల్స్ యాప్స్ లో గాని ఇతర యాప్స్ తో గాని చాట్జీపీటీ వాడటానికి నిషేధం విధించింది.భవిష్యత్తు తరాలపై ఏఐ వల్ల చెడు ప్రభావం ఉండకూడదని యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇది మంచి పరిణామమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు