తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్( Phone tapping ) వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) స్పందించారు.
ఈ మేరకు తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి( Konda Surekha ) వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.లేకపోతే లీగల్ నోటీసులతో పాటు పరువునష్టం దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.