ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే.. పేరున్న ఏ సర్వే చూసినా వైసీపీదే ప్రభంజనం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు చాలా ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్( Exit polls ) ఫలితాలు విడుదలయ్యాయి.

ఆ ఫలితాలలో పేరున్న సంస్థల ఫలితాలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉండగా ఊరూపేరు లేని సర్వే సంస్థల ఫలితాలు మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

ఆరా మస్తాన్ వైసీపీ 94 నుంచి 104 స్థానాలతో అధికారం సొంతం చేసుకోనుందని ఇప్పటికే తేల్చి చెప్పారు.కూటమికి మాత్రం కేవలం 71 నుంచి 81 స్థానాల్లో విజయం దక్కే ఛాన్స్ అయితే ఉంది.

ఆత్మసాక్షి సంస్థ సైతం రాష్ట్రంలో ఫ్యాన్ గిర్రున తిరగనుందని పేర్కొంది.వైసీపీకి 98 నుంచి 116 స్థానాలతో అనుకూల ఫలితాలు రానున్నాయని ఈ సంస్థ లెక్కలతో వెల్లడైంది.కూటమి మాత్రం కేవలం 59 నుంచి 77 స్థానాలకు పరిమితం కానుందని తెలుస్తోంది.

గత ఐదేళ్లలో కూటమి పెద్దగా పుంజుకోలేదని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది.మరో ప్రముఖ సంస్థ రేస్ సైతం వైసీపీ 117 నుంచి 128 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది.

Advertisement

కూటమి మాత్రం 48 నుంచి 58 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.పోల్ స్ట్రాటజీ( Poll strategy ) గ్రూప్ శాతం ఏపీలో వైసీపీదే అధికారమని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని వెల్లడించింది.115 నుంచి 125 స్థానాలలో వైసీపీకి విజయం దక్కనుందని 50 నుంచి 60 స్థానాల్లో మాత్రమే సైకిల్ కు ఛాన్స్ ఉందని పేర్కొంది.ఆపరేషన్ చాణక్య సర్వేలో వైసీపీ 95 నుంచి 102 స్థానాల్లో గెలవనుందని వెల్లడి కాగా టీడీపీ( TDP ) 64 నుంచి 68 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి.

చాణక్య పార్థదాస్ సర్వేలో వైసీపీ( YCP ) 110 నుంచి 120 స్థానాల్లో విజయం సొంతం చేసుకోనుండగా కూటమి 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.వ్రాప్ స్ట్రాటజీస్ సంస్థ ఏకంగా వైసీపీ 158 నుంచి 171 స్థానల్లో విజయం సాధించి సంచలనం సృష్టించనుందని కూటమికి కేవలం 4 స్థానాలు వస్తాయని చెబుతోంది.

అగ్నివీర్ సంస్థ వైసీపీ 124 నుంచి 128 స్థానాల్లో విజయం సాధిస్తుందని కూటమి 46 నుంచి 49 స్థానాలకు పరిమితం కానుందని తేల్చేసింది.పొలిటికల్ లేబొరేటరీ లెక్కల ప్రకారం వైసీపీ 108 స్థానాల్లో కూటమి 67 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు