ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వానికి ‘ సూపర్ సిక్స్ ‘( Super Six ) బెంగ పట్టుకుంది.ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలను ఇచ్చి మరీ ప్రజలను ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. అధికారంలో కి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు.
అనుకున్నట్టుగానే టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది.కానీ ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలోనే ప్రభుత్వానికి నిధుల గురించి బెంగ పట్టుకుంది.
గెలుపు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ దీనిపై సీఎం చంద్రబాబు( CM Chandrababu ) అధికారులకు క్లారిటీ ఇచ్చారు.ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నామని చెప్పిన ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వేళ్ళబోమని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలలో ఫించన్ ఇప్పటికే అమలు చేశారు.నెలకు 4000 రూపాయలు అందిస్తున్నారు.దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించారు.
అంటే ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి మూడు వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది .జనవరి నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు .దీనికి 17వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే ఆర్థిక శాఖ అధికారులు సూపర్ సిక్స్ అమలు కోసం ఎంత మేరకు ఖర్చు అవుతుందనే దానిపైన ఇప్పటికే లెక్కలు వేశారు. సూపర్ సిక్స్ అమలుకు 1.20 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.గత వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోసం 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.అంటే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం( TDP Alliance Govt ) అదనంగా 50 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
దీంతో నిధులను ఎక్కడి నుంచి తేవాలని ఆర్థిక శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కేంద్రం నుంచి కాకుండా రాష్ట్రం నుంచి ఆ నిధులను ఏ విధంగా సమీకరించాలనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించారు .ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు 15 వేల కోట్ల రూపాయలు వస్తాయి. అలాగే పోలవరానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని ఏపీలో సంక్షేమ పథకాలకు( Welfare Schemes ) పూర్తిగా ఏపీ ప్రభుత్వమే నిధులు సమకూర్చుకోవాల్సి ఉండడంతో ఇక అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా మారింది.
రాష్ట్రం అమలు చేసే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ కోసం నెల వారి అప్పులు చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు , పెన్షన్లు చెల్లించడానికి పోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి అదనంగా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఎఫ్ ఆర్ ఎం బ కి లోబడి రుణాలను పొందాల్సి ఉంటుంది.దానిని మించితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.దానికి కేంద్రం అనుమతిస్తుంది అనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.