సాగర్ డ్యాంపై ఏపీ సర్కార్ దండయాత్ర దుర్మార్గం..: గుత్తా

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ ప్రభుత్వం దండయాత్ర దుర్మార్గమని తెలిపారు.

 Ap Sarkar's Invasion Of Sagar Dam Is Evil..: Gutta-TeluguStop.com

నీటిని ఏపీ దొంగతనంగా తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.తాము ఎన్నికల బిజీలో ఉన్న క్రమంలో అదును చూసి దురాక్రమణకు పాల్పడటం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు.

నదీ జలాలు ఏ ప్రాంతంలో ఉంటే వారికే ప్రాజెక్టు మీద హక్కులు ఉంటాయన్నారు.విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని తెలిపారు.

అయితే సాగర్ ప్రాజెక్టుపై హక్కు లేకపోయినా ఏపీ మొండిగా వ్యవహారిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఏపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube