ఏపీ శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది.ప్రభాకర్ రెడ్డిపై శాప్ డైరెక్టర్లు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎండీ ప్రభాకర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.అనంతరం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్ధన్ కు శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.కాగా నిన్న జరిగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్డు సమావేశంలో ఎండీ తీరుపై ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.