దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైన వెలువడే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ ను( Election Notification ) దృష్టిలో పెట్టుకుని ముందుగానే అన్ని పార్టీలు తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తూ, సభలు, సమావేశాల పేరుతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
గత సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీన ప్రకటించడంతో , ఈసారి అలానే ప్రకటిస్తారని అంతా భావించినా, ఈసారి ఆలస్యం అయింది.కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) అధికారుల హడావుడి చూస్తుంటే మరో వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్ము కాశ్మీర్ లో బుధవారం వరకు పర్యటించనుంది.

అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో ఒక క్లారిటీకి రాబోతోంది.ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.ఎన్నికల షెడ్యూల్ ను( Election Schedule ) మార్చి 14 , 16 తేదీల మధ్యన ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా అప్పుడే ప్రకటించనున్నారు.జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు( Supreme Court ) ఆదేశించింది.

దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఎంతవరకు ఉందనేది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను కోరింది.వాస్తవంగా చూసుకుంటే లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) దేశవ్యాప్తంగా ఆరేడు దశల్లో నిర్వహిస్తారు మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు( AP Elections ) ఉండబోతున్నాయి .ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీంతో మొదటి విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి.