ఏపీ సీఎం జగన్,( CM Jagan ) ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) లేఖ రాశారు.ప్రత్యేక హోదా సహా విభజన హామీలతో పాటు పదేళ్లలో బీజేపీ చేసిన మోసాలపై చర్చించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
హామీలు అమలు చేసేందుకు ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలిపారు.ఈ క్రమంలోనే ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని వెల్లడించారు.మరోవైపు వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనకు( Districts Tour ) వెళ్లనున్న సంగతి తెలిసిందే.