నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) పై తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే.మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం హాజరు కావడంతో టీడీపీ పచ్చ ముఠా జగన్ పై ఈ దాడి చేయించిందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 Ap People Fire On Tdp Details Here Goes Viral In Social Media Ap People,ap Polit-TeluguStop.com

సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిందంటే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఖండించాలి.అయితే టీడీపీ నాయకులు దాడిని ఖండించకుండా ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు.

సీఎం జగన్ పై భౌతికంగా జరిగిన దాడి కంటే సోషల్ మీడియాలో ఆయన స్థాయిని తగ్గించేలా ఐటీడీపీ, లోకేశ్, ఆ రెండు పత్రికలు చేస్తున్న దాడి ఎక్కువని వైసీపీ అభిమానులు( YCP Fans ) చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) జగన్ పై దాడి గురించి స్పందించడంతో చంద్రబాబు జగన్ పై దాడి గురించి నామమాత్రంగా స్పందించారే తప్ప ఆయన మనస్సులో ఈ ఘటన గురించి స్పందించాలనే ఆలోచన లేదు.చంద్రబాబు( Chandrababu Naidu ) ఆలస్యంగా స్పందించడంతో ఆయన నిజస్వరూపం ఏంటో అర్థమైందని సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారు. ఐటీడీపీ ట్వీట్లు( ITDP Tweets ) ఒకలా ఉంటే చంద్రబాబు కామెంట్లు మరోలా ఉన్నాయి.

చంద్రబాబు నీచ రాజకీయాలు( Worst Politics ) తమకు నచ్చడం లేదని న్యూట్రల్ ఓటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.జగన్ పై జరిగిన దాడికి ఓటు రూపంలో సమాధానం చెబుతామని ఓటర్లు కామెంట్లు చేస్తున్నారు.

టీడీపీ నేతలు( TDP Leaders ) జగన్ పై దాడి విషయంలో జుగుప్సాకరంగా చేస్తున్న కామెంట్ల వల్ల తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారని ఏపీలో 2019 ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఆయన ప్రాణాలకే అపాయం అనేలా ప్రచారం చేసిన పచ్చ మీడియా జగన్ పై జరిగిన దాడికి సాక్ష్యాలున్నా డ్రామా అంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube