జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ఇంటా బయటా విమర్శలు గుప్పిస్తున్నారు.పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కబుర్లు చెప్పడం తప్ప ఇప్పటి వరకూ ఒరిగింది లేదని తెలిపారు.
కేంద్రప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది అనేది వాస్తవం.అయితే ఈ విషయంలో ముందుగా స్పందించింది వైసీపి తమ పార్టీ తమ ఎంపీలతో రాజీనామా చేయించడానికి సిద్దం అయ్యింది.అంతేకాదు
ఏపీ లో అధికార పార్టీ కూడా కేంద్రంపై తిరుగుబావుటా వేస్తోంది.ఇప్పటికే తన మంత్రులతో,ఎంపీలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించారు…తమ పార్టీ నేతల అభిప్రాయలు కూడ తెలుసుకున్నారు.
అయితే అందరు కూడ బీజేపీతో పొత్తు నుంచీ బయటకి రావాలని చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నారు.అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయడం లేదు కానీ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు.ప్రశ్నిస్తాం అని పార్టీ పెట్టి అప్పుడప్పుడు వచ్చి హడావడి చేసి వెళ్ళిపోవడం.
కేంద్రం బడ్జెట్ ప్రకటించిని రెండో రోజు అవుతున్నా ఇప్పటి వరకూ జనసేన తరుపున ఎటువంటి అభ్యతరం తెలుపక పోవడం.ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడ ప్రకటించకపోవడం చూస్తుంటే ఏపీ పై పవన్ కి ఎంత అభిమానం ఉందొ అర్థం అవుతోందని అంటున్నారు .చంద్రబాబు కి రాజకీయ సాయం చేయడానికే పవన్ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప.ఏపీ ప్రజల కోసం కాదు అని స్వార్ధ ప్రయోజనాలకోసమే అనేది ఏపీ ప్రజల వాదన…పవన్ అవలంబిస్తున్న పద్దతులు ప్రవర్తనా సరళి పవన్ అభిమానులకి కూడా నచ్చడం లేదని అంటున్నారు.
మరి ఇప్పటికైనా పవన్ స్పందిస్తాదేమో వేచి చూద్దాం.