అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.పొత్తులపై జనసేన, తెలుగుదేశం నేతలు సమన్వయంతోనే ప్రకటనలు చేస్తున్నాయి.
ఒ పక్క త్యాగం అంటున్నారు మరో వైపు నేనే నాయకత్వం వహిస్తానంటున్నారు.చంద్రబాబు మాట్లాడుతుంటే శవం మాట్లాడుతున్నట్లుగా ఉంది.
చంద్రబాబు ఇంకా రాజరికంలో ఉన్నామనుకుని ప్రజలను తేలిక భావంతో చూస్తున్నారు.చంద్రబాబు లేనిపోని ఆరోపనలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు చేసే ఆరోపనలను ప్రజలు నమ్మడం లేదు.త్వరలో ఆత్మకూరు ఉప ఎన్నికలు వస్తున్నాయి.
ఏడాదిన్నర ,రెండేళ్లలో ఎన్నికలకు పోతున్నాం.గత ఎన్నికల తర్వాత వైఎస్ ఆర్ సీపీ మరింత బలపడింది…ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయి.
పన్నులన్నీ చంద్రబాబు వారసత్వంగా ఇచ్చిపోయివే.కొత్తగా వేసిన పన్నులను ప్రజలకు వివరించి అమలు చేస్తున్నాం.
పన్నులపై వచ్చిన ప్రతి పైసాను ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నాం.తెలంగాణలో నాడు నేడు పథకంలో ఎపీ తో సమానంగా స్కూళ్లు అభివృద్ది చేస్తున్నారు.దీనికోసం ఎపీ కంటే తెలంగాణ బడ్జెట్ లో రెండింతలు ఖర్చు చేస్తున్నారట.అదే నిజమైతే ఏమి జరుగుతుందనేది అక్కడే తెలుస్తుంది.
సీఎం జగన్ ప్రతి రూపాయినీ సేవ్ చేస్తున్నారు.ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసా నిధులను సీఎం సద్వినియోగం చేస్తున్నారు.
చంద్రబాబు సభలకు జనాన్ని తీసుకొచ్చి బలమని డ్రామా ఆడుతున్నారు.తెలుగుదేశం వారు వాపును బలంగా అనుకోవద్దు.
నేను విజయసాయిరెడ్డి భేటీకి ప్రత్యేకత ఏమీ లేదు.సీఎం జగన్ మార్గదర్శకంలో నేను,విజయ సాయిరెడ్డి నడుస్తాం.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు.రాష్ట్రాన్ని సేవ్ చేశారు.
కరోనా వచ్చినా,ఈ పరిస్థితుల్లో సీఎంగా జగన్ ఉండటం వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉంది.