కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న షర్మిల 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన అన్న , వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై ఎదురుదాడి మొదలుపెట్టారు వైఎస్ షర్మిల.రాజకీయంగానూ,  వ్యక్తిగత అంశాలను ప్రధాన అస్త్రాలు గా చేసుకుని తీవ్రస్థాయిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

 Ap Pcc Chief Ys Sharmila Focus On Special Status For Ap , Ap Special Status, J-TeluguStop.com

ఇది చాలదన్నట్లుగా ఏపీకి ప్రత్యేక హోదా( Ap special status ) అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని హైలైట్ చేసి ఢిల్లీలో ధర్నా చేపట్టేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రత్యేక హోదాపై షర్మిల ధర్నా చేయనున్నారు .దీనిలో భాగంగానే ఏపీ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు అందరిని ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిల ఆదేశించారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Status, Congress, Jagan, Rahul Gandhi, Ys Sharmila-Po

 దీంతోపాటు కొంతమంది ఏఐసిసి పెద్దలు కూడా ధర్నాలో పాల్గొంటారని షర్మిల సంకేతాలు ఇస్తున్నారు.గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టింది .ఇదే అంశంతో జగన్ ఎన్నికలకు వెళ్లారు.అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇదే అంశాన్ని హైలైట్ చేసుకుని జగన్ బీజేపీ( BJP )ని ఇరుకుని పెట్టే విధంగా షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ ( Rahul Gandhi )సైతం ఇప్పటికే ప్రకటించారు.గతంలోనూ అదే ప్రధాన హామీగా జగన్ పోరాటం చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Status, Congress, Jagan, Rahul Gandhi, Ys Sharmila-Po

తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టడం , బిజెపితో సఖ్యత గా ఉండడం,  ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వైసిపి వదిలిపెట్టడంతో , ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసుకొని కాంగ్రెస్ ను బలోపేతం చేసి , ఏపీలో వైసిపి ని ఇరుకుని పెట్టాలనే లక్ష్యంతో షర్మిల వ్యూహాత్మకంగా ఢిల్లీలో ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube