కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న షర్మిల 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన అన్న , వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై ఎదురుదాడి మొదలుపెట్టారు వైఎస్ షర్మిల.

రాజకీయంగానూ,  వ్యక్తిగత అంశాలను ప్రధాన అస్త్రాలు గా చేసుకుని తీవ్రస్థాయిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

ఇది చాలదన్నట్లుగా ఏపీకి ప్రత్యేక హోదా( Ap Special Status ) అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని హైలైట్ చేసి ఢిల్లీలో ధర్నా చేపట్టేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రత్యేక హోదాపై షర్మిల ధర్నా చేయనున్నారు .

దీనిలో భాగంగానే ఏపీ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు అందరిని ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిల ఆదేశించారు.

"""/" /  దీంతోపాటు కొంతమంది ఏఐసిసి పెద్దలు కూడా ధర్నాలో పాల్గొంటారని షర్మిల సంకేతాలు ఇస్తున్నారు.

గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టింది .

ఇదే అంశంతో జగన్ ఎన్నికలకు వెళ్లారు.అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇదే అంశాన్ని హైలైట్ చేసుకుని జగన్ బీజేపీ( BJP )ని ఇరుకుని పెట్టే విధంగా షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ ( Rahul Gandhi )సైతం ఇప్పటికే ప్రకటించారు.

గతంలోనూ అదే ప్రధాన హామీగా జగన్ పోరాటం చేశారు. """/" / తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టడం , బిజెపితో సఖ్యత గా ఉండడం,  ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వైసిపి వదిలిపెట్టడంతో , ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసుకొని కాంగ్రెస్ ను బలోపేతం చేసి , ఏపీలో వైసిపి ని ఇరుకుని పెట్టాలనే లక్ష్యంతో షర్మిల వ్యూహాత్మకంగా ఢిల్లీలో ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

జై శ్రీరామ్ చెప్తేనే ఫ్రీ ఫుడ్ అంటున్న అంకుల్.. చెప్పనన్న మహిళ.. చివరకు?