ఇటీవల లండన్ ట్రైన్‌లో( London Train ) పొట్టు పొట్టుగా ప్యాసింజర్లు కొట్టుకొని మిగతా ప్రయాణికులకు హడల్ పుట్టించారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
ఓల్డ్ స్ట్రీట్ స్టేషన్‌లో( Old Street Station ) రద్దీగా ఉన్న రైలులో నలుగురు వ్యక్తులు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నకోవడం వీడియోలో కనిపించింది.శనివారం రాత్రి గొడవ జరగగా ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముగ్గురు వ్యక్తులు బట్టతల ఉన్న ఓ వ్యక్తిని రైలు నుండి బయటకు లాగి ప్లాట్‌ఫామ్‌పై దాడి చేయడం వీడియోలో మనం చూడవచ్చు.బట్టతల మనిషి తిరిగి పోరాడి తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు.
చచ్చేటట్టు కొట్టుకుంటున్న వీరిని చూసి మిగతా ప్రయాణికులు( Passengers ) భయాందోళనకు గురయ్యారు.వారు ఈ కొట్లాటను ఆపడానికి, వారి నుంచి తప్పించుకోవడానికి అరుస్తూ కనిపించారు.
ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (TFL) నుంచి ఒక వర్కర్ వచ్చి వారి కొట్లాటకు ముగింపు పలికాడు.
ఈ వీడియోను ఎక్స్‌లో 9 లక్షల మందికి పైగా చూసారు.ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.కొందరైతే కొట్లాట చూసి అసహ్యించుకున్నారు.
ప్రజలు మరీ ఇంత చీప్ గా ఎలా ప్రవర్తిస్తారని మరికొందరు ఫైర్ అయ్యారు.ప్రజా రవాణా, అక్కడ పనిచేసే వ్యక్తుల భద్రత గురించి కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరైతే ఆ గొడవకు కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని చూపించారు.
దీనికి ఫుట్‌బాల్‌తో ఏదైనా సంబంధం ఉందా అని ఆశ్చర్యపోతారు.పోరాటాన్ని ఆపిన TFL కార్మికుడి ధైర్యసాహసాలకు కొంతమంది ముగ్ధులయ్యారు.ఇలాంటివి లండన్‌లో( London ) మాత్రమే జరుగుతాయని కొందరు భావిస్తున్నారు.
బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు( British Transport Police ) ఈ కొట్లాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.ఏదైనా సమాచారం లేదా సాక్షులు తమకు సహాయం చేయాలని వారు ప్రజలను కోరారు.
ఈ వీడియోను మీరు కూడా చూడండి.