Bjp: బీజేపీ వ్యూహం అర్థం కాక ఏపీ పార్టీల గందరగోళం 

ఏపీ విషయంలో బిజెపి ( bjp )వ్యూహం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.

 ఏపీలో బీజేపీకి సొంతంగా ఒక్క సీటు గెలుచుకునే అంత బలం లేకపోయినా,  ప్రధాన పార్టీలుగా ఉన్న వైసిపి , టిడిపి ,జనసేన( YCP, TDP, Janasena ) లను తమ గ్రిప్ లో పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఏపీలో ఏ పార్టీ గెలిచినా,  తప్పకుండా బీజేపీ కి మద్దతు ఇవ్వాల్సిన  పరిస్థితిని సృష్టించింది.ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినా,  వైసిపి వచ్చినా,  కేంద్రంలో బిజెపికి మద్దతు పలకాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఏ పార్టీ బీజేపీ ని వ్యతిరేకించలేని పరిస్థితి.  ప్రస్తుత అధికార పార్టీ వైసిపి పరోక్షంగా బిజెపికి అన్ని విషయాలలోనూ సహకారం అందిస్తుండగా , టిడిపి, జనసేన లు సైతం బిజెపిని వ్యతిరేకించే పరిస్థితి లేదు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చినా,  ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకున్నా , ప్రస్తుతం వైసీపీ మాదిరిగానే బిజెపికి సహకారం అందించాల్సిందే.

Ap Party Confusion Without Understanding Bjps Strategy
Advertisement
Ap Party Confusion Without Understanding Bjps Strategy-Bjp: బీజేపీ

బిజెపితో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారారని టిడిపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.ఇక వైసిపి కూటమిలో చేరకపోయినా బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగుతామనే సంకేతాలు పంపిస్తోంది .బిజెపితో పొత్తులపై టిడిపి ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడలేదు.ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు( chandrababu ) ఆసక్తి చూపిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా , జెపి నడ్డాలతో( Amit Shah, JP Nadda ) చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి భేటీ అయ్యారు.అయితే ఆ సమావేశాల్లో ఏ ఏ విషయాలపై చర్చించారు అనేది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

Ap Party Confusion Without Understanding Bjps Strategy

ఇక వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) సైతం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశం అయ్యారు.ఆయన ఏ విషయాలపై చర్చించారు అనేది సరైన క్లారిటీ లేదు.ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాల్లో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని,  అన్ని పార్టీలు తప్పనిసరిగా తమకు మద్దతు ఇచ్చి తీరుతాయనే నమ్మకంతో ఉన్న బిజెపి ఏపీ రాజకీయ పార్టీలను పొత్తుల విషయంలో గందరగోళానికి గురిచేస్తూ పొలిటికల్ గేమ్ ఆడుతోంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు