మంత్రుల బస్సు యాత్ర : మొదటి రోజు అలా.. రెండో రోజు ఇలా ?

ఒకపక్క గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది.వైసీపీ కి చెందిన ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు నిన్న శ్రీకారం చుట్టారు.

 Ap-ministers Bus Tour Second Day Shedyul Ap Ministers, Ap Ministers Bus Tour, Ja-TeluguStop.com

ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఉండగానే మంత్రుల యాత్ర ప్రారంభం కావడంతో ఈ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అందరికీ ఉత్కంఠ కలిగించింది.ఒకపక్క తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభం కావడంతో దానికి పోటీగా వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టారనే ప్రచారం జరుగుతోంది .ఇదిలా ఉంటే ఈ బస్సు యాత్ర ద్వారా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎంతవరకు మేలు జరిగింది అనే విషయాన్ని హైలెట్ చేసేందుకు ఈ యాత్రను ఉపయోగించుకుంటున్నారు.
        మొదటి రోజు శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు.

తొలిరోజు ఏర్పాటుచేసిన సభ వర్షం కారణంగా సక్సెస్ కాలేదు.సభా వేదిక వర్షం కారణంగా జనాలు పెద్దగా హాజరుకాకపోవడంతో మంత్రులు వచ్చే సమయానికి సభా వేదిక వద్ద పెద్దగా జన సందోహం లేకపోవడంతో  యాత్ర అసంతృప్తిగానే ముగిసింది.

ఇక రెండో రోజు చేపట్టిన మంత్రుల సామాజిక న్యాయం బస్సుయాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది .ఉదయం 9 గంటలకు పాత గాజువాక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ యాత్రను మొదలు పెట్టారు.10.15 గంటలకు లంకెలపాలెం జంక్షన్, 10.45 గంటలకు అనకాపల్లి బైపాస్, 11.15 గంటలకు తాళ్లపాలెం జంక్షన్, 11.45 గంటలకు యలమంచిలి జంక్షన్ వరకు యాత్ర సాగనుంది.మధ్యాహ్నం 12:15 కు నక్కపల్లి, 12:45 గంటలకు తుని, 1.15 నిమిషాలకు అన్నవరం చేరుకుంటారు .అక్కడ భోజనం చేస్తారు.తరువాత 2.30 కి జగ్గంపేట, 4.30 కి రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ కు చేరుకుంటారు.
     

Telugu Ap Ministers, Jagan, Rajamundry, Tdp Mahanadu, Telugudesam-Politics

 రాజమండ్రి లో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ప్రసంగిస్తారు .ఈ సభ నిర్వహణ కోసం ఇప్పటికే ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగింది.దీని కోసం భారీగా జనసమీకరణ ను చేపట్టారు.

ఈ యాత్రకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు .ఇక ముందు ముందు జరగబోయే సభలకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టే విధంగా ప్రత్యేక టీమ్ లు స్థానిక నాయకుల తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube