రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో దాదాపు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినమని మోడీ అమిత్ షా ల అహంకారం పరాకాష్టకు చేరుకుందని ఇది అత్యవసర పరిస్థితిని తలపిస్తుందంటూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా కోర్టు తలుపులు కూడా తట్టారు.ఈ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ఆంధ్ర ప్రదేశ్ అధికార ,ప్రతిపక్ష నాయకులు ఒక్కరు కూడా ఇంతవరకు ఒక్క ప్రకటన చేయలేదు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేశారు.

ఆయన చివరి శ్వాస వరకు గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడుగా ఉన్నారు.ఇప్పుడు జగన్ ( YS jagan )కనీసం నైతిక మద్దతుగా కూడా ఒక ప్రకటన కూడా చేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.చెల్లెలు షర్మిల కూడా కేంద్ర ప్రబుత్వ వైఖరిని ఎండగట్టింది .ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనంటూ ఆమె బహిరంగంగా ప్రకటించింది .మరి ముఖ్య మంత్రి హోదా లో జగన్ నుంచి కనీస స్పందన లేకపోవడం ఆసక్తికరంగా మారింది బహుశా తనను 16 నెలలపాటు జైలు పాలు చేసిన కాంగ్రెస్ మీద పగ ఇంకా జగన్కు చల్లారలేదు ఏమో.కనీసం ఆయనకు ఆ కారణమైనా ఉంది మరి మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటూ లెక్చర్లు దంచే టిడిపి అధినేత చంద్రబాబు మౌనం గా ఉండడం ఏమిటో అర్దం కావడం లేదు .ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఐక్యతరాగం వినిపిస్తుంటే ఇది అసలు మనకు సంబంధం లేని విషయం అన్నట్టు మౌనంగా ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు.ఎంత భాజపాతో పొత్తు కోసం వెంపర్లాడితే మాత్రం ఇలాంటి ముఖ్య మైన విషయాలలో కూడా కనీసం నామమాత్రపు స్పందన కూడా లేకపోవడం అత్యంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం కి సరికాదని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పోటీ చేసిన పాత మిత్రత్వం కూడా చంద్రబాబుకు ఉంది.మరి ఏ రకంగా చూసినా తన మిత్రుడికి నైతిక మద్దతు తెలిపాల్సిన కనీసం బాధ్యత చంద్రబాబుకు ఉంటుంది ఆయన కానీ ఆయన మంత్రివర్గంలోని వ్యక్తులు గాని ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు ఈ విషయంలో జనసేన అధినేత( pawan kalyan ) కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటానికి ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రంలో జరుగుతున్న వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేనట్టు మౌనంగా ఉండటం చాలా విచిత్రమైన రాజకీయ పరిణామంగా భావించాలి.