రేపే ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు( Intermediate supplementary results ) విడుదల కానున్నాయి.మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించగా… ఇటీవలే మూల్యాంకనం పూర్తయింది.
దీంతో రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలను విడుదల చేయబోతున్నారు.ఏప్రిల్ నెలలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా 66.21% ఉత్తీర్ణత నమోదు కావడం జరిగింది.రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా… వారిలో 5,38,327 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది.

పాసైన వారిలో ఎక్కువ బాలికలు 65%( Girls 65% ) కాగా బాలురు 58% ఉండటం జరిగింది.మే 24 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన ఇంటర్, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు … సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తారీఖు వరకు నిర్వహించగా… రేపు ఫలితాలు విడుదల చేయబోతున్నారు.మరి ఈసారి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యుంటారో చూడాలి.







